పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ ఎంపీ కేసీ వేణు గోపాల్ తెలిపారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో చురుకుగా పాల్గొంటున్న రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆయన అన్నారు. డిసెంబర్ 7 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ప్రస్తుతం రాహుల్ జోడో యాత్రలో మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది.