తమ భూమిని రక్షించుకోవటం కోసం శత్రుదేశంపై దాడి చేయడానికైనా సిద్ధమని పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ పేర్కొన్నారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని రాఖ్‌చిక్రీ సెక్టార్లో పర్యటించిన ఆయన, అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో భారత్‌ను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఓసీలో నెలకొన్న తాజా పరిస్థితులు, కార్యాచరణ సంసిద్ధత, భారత్ ప్రకటనలపై సైనికాధికారులతో అసీమ్ చర్చించారు.