యూపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గాజియాబాద్‌లో నర్సుగా పనిచేస్తున్న కవిత నవంబర్ 29న భర్త మహేశ్‌తో గొడవపడింది. తర్వాత అతడు నిద్రలో ఉండగా నోట్లో బట్టలు కుక్కి గొంతు నులిమి చంపేసింది. అనంతరం తాను పనిచేస్తున్న ఆస్పత్రికి అతడి మృతదేహాన్ని తరలించి తన భర్త సూసైడ్ చేసుకున్నాడని వైద్యులకు తెలిపింది. శవాన్ని పరిశీలించిన వైద్యులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో అతడు హత్యకు గురయ్యాడని నిర్ధారించుకున్న పోలీసులు కవిత 13 ఏళ్ల కూతుర్ని ప్రశ్నించారు. తన తండ్రిని తల్లి హతమారుస్తుండగా తాను కిటికీలోంచి చూసినట్లు బాలిక తెలిపింది. దీంతో కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఆస్పత్రిలో ఇన్సురెన్స్ విభాగంలో పనిచేసే వినయ్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఈ హత్యలో అతడి కుట్ర కూడా ఉందని తేలడంతో వినయ్‌ని కూడా అరెస్టు చేశారు.