'హిజాబ్'కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. 'మోరల్ పోలీస్' వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో టెహ్రాన్‌లో 22 ఏళ్ల యువతి మహ్‌సా అమిని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ 16న పోలీసు కస్టడీలో ఆమె మరణించింది. అప్పటి నుంచి ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. 'మోరల్ పోలీసులు'ను గాష్ట్-ఇ ఎర్షాద్ లేదా "గైడెన్స్ పెట్రోల్" అని పిలుస్తారు. హిజాబ్‌ను మహిళలు సరిగ్గా ధరించేలా చూడడమే వీరి విధి. ఈ యూనిట్‌ను 2006లో అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ప్రారంభించారు.