ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే 'భారత్ జోడో యాత్ర' అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుండగా, వచ్చే ఏడాది 2 నెలల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 'మహిళా మార్చ్' చేపట్టనున్నారు. 2023 జనవరి 26 నుంచి మార్చి 26 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మహిళ మార్చ్‌ను నిర్వహించనున్నట్లు పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రాహుల్ జోడో యాత్ర ముగింపు రోజే ప్రియాంక యాత్ర ప్రారంభంకానుంది.