ముంబై సబర్బన్ పరిధిలోని కుర్లా ప్రాంతంలో దారుణం జరిగింది. 42 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం సామూహిక అత్యాచారం చేశారు. అసహజ రీతిలో తమ కామవాంఛ తీర్చుకున్నారు. అత్యాచారం చేశాక బాధితురాలి ప్రైవేట్ భాగాలపై సిగరెట్లతో కాల్చారు. పదునైన ఆయుధంతో ఆమె శరీరంపై గాయాలు చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరించారు. ఓ ఎన్జీఓ సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు.