ట్విట్టర్ అధినేతగా ఎలాన్ మస్క్ పగ్గాలు చేపట్టాక సంస్థలో అనేక మార్పులు చేపట్టారు. ఈక్రమంలో మస్క్ చర్యలతో దిగ్గజ కంపెనీలు వేలకోట్లు నష్టపోయాయి. ఆ నష్టభయాన్ని ముందే గుర్తించిన ఇతర సంస్థలు ట్విటర్‌లో అడ్వటైజ్‌మెంట్లను నిలిపివేశాయి. అయితే అమెజాన్ మాత్రం ట్విటర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడాదికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. యాపిల్ సైతం ట్విటర్‌లో ప్రకటనలను తిరిగి ప్రారంభించనున్నట్లు మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.