బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను తీసుకోవడం లేదంటూ బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. పంత్ స్థానంలో మరే ఇతర ఆటగాడిని తీసుకోలేదంటూ తెలిపింది. ఈ సిరీస్ అనంతరం టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి పాల్గొంటాడని పేర్కొంది. బీసీసీఐ వైద్యుడిని కలిసేందుకు తీసుకున్న అపాయింట్మెంట్ కారణంగా రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడటం లేదని. రానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి జట్టులో చేరతాడని ట్వీట్ చేసింది బీసీసీఐ. అటు, కనీసం పంత్ స్థానంలో ఆడటానికైనా సంజూకి అవకాశం ఇస్తే బాగుంటుందంటూ అతని అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.