ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద స్కాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజకీయ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో అసలు విషయం తేలుతుందని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఈడీ దూకుడు కొనసాగిస్తోంది. 2014-19 మధ్య కాలంలో రూ.234 కోట్లు దారి మళ్లించినట్లు గుర్తించింది. ఈ కేసులో 26 మందికి నోటీసులు ఇచ్చింది. మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ కృష్ణ ప్రసాద్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.