వచ్చే ఏడాది ఆసియా కప్ నేపథ్యంలో పాకిస్థాన్లో టీమ్ఇండియా పర్యటనపై కొన్నాళ్లుగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరుదేశాల ఆటగాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించాడు. ఇలాంటి పర్యటనలు రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలను బలపరుస్తాయన్నాడు. ఇక ఈ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా బౌలర్లు, బీసీసీఐని ఈ ఆటగాడు ప్రశంసించాడు.