కర్నూలు రాయలసీమ గర్జన సభలో వైసీపీ నేత, ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కళ్లుతిరిగి పడిపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన తరువాత ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు.అయితే, సిద్ధార్థ రెడ్డి కాసేపటికే తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతకముందు ఈ సభలో మాట్లాడిన సిద్ధార్ధ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.