చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడి చేసారు.ఈ సంఘటనపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. దాడికి సంబంధించిన ట్విట్టర్ లో పంచుకున్నారు. 'ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు...నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారూ... నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు' అని ట్విట్ చేసారు.