పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ పార్టీ శ్రేణులుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజవర్గంలో రైతు సభను నిర్వహించాలని అనుకోవడం రామచంద్ర యాదవ్ చేసిన నేరమా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎదిరించి నిలబడితే ఆస్తులు ధ్వంసం చేస్తారా అని అన్నారు. రామచంద్ర ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి దాడులను ఖండించాలని ఆయన అన్నారు.