ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలపై వ్యూహాలు రచించేందుకు బీజేపీ పార్టీ ఈ భేటీలు నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు దీనికి హాజరయ్యారు.