ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. అంబికాపూర్ మెడికల్ కళాశాలలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నలుగురు శిశువులు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.