నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా సోమవారం మరోసారి ఎన్నికయ్యారు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు అబ్దుల్లా నామినేషన్ మాత్రమే అందిందని ఎన్సి ప్రధాన కార్యదర్శి అలీ మహ్మద్ సాగర్ తెలిపారు.ఫరూక్ అబ్దుల్లాకు మద్దతుగా కాశ్మీర్ నుంచి 183, జమ్మూ నుంచి 396, లడఖ్ నుంచి 25 ప్రతిపాదనలు వచ్చాయని సాగర్ తెలిపారు.సీనియర్ నాయకుడు ఇటీవల తన ఆరోగ్య దృష్ట్యా పదవి నుండి వైదొలగాలని ఆకాంక్షించారు.