ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయ రాజధాని కోసం గ‌ళం విప్పిన‌ సీమ వాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 04:00 PM

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన విజ‌య‌వంత‌మైంది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ సోమ‌వారం నిర్వ‌హించారు. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,విద్యార్థులు, న్యాయవాదులు,  మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొని వారి ప్ర‌సంగాల‌తో స్ఫూర్తి నింపారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు గ‌ళం విప్పారు.  శ్రీబాగ్‌ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాయ‌ల‌సీమ గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్‌ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్‌, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, హాఫీజ్‌ఖాన్‌, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, తొగూరు ఆర్థ‌ర్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌, బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌రై ప్ర‌సంగించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com