మూకుమ్మడి రాజీనామాలకు ఎంపీ రఘురామ కృష్ణరాజు పిలుపునిచ్చారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కొసం అవిశ్వాస తీర్మానం పెట్టి రాజీనామా చేద్దామని తమ పార్టీ ఎంపీలకు సూచించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారని.. ప్రభుత్వ సలహాదారుల పేరుతో దోచేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 29వ తేది పార్లమెంట్ ఆఖరి రోజని.. ప్రత్యేక హోదా కోసం ఈ లోపే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు. అందరం కలిసి రాజీనామా చేద్దామని.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామని సీఎం జగన్కు రఘురామ సూచించారు.