ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ కాశ్మీర్ ను సాధించడానికి ఇదే మంచి తరుణం: కాంగ్రెస్ నేత హరీశ్ రావత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 09:47 PM

పీఓకేను పాకిస్థాన్ అక్రమంగా స్వాధీనం చేసుకుందని... దానికి స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవడం మన బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీన పరిస్థితిలో ఉందని... పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడం మన బాధ్యత అని చెప్పారు. 


పీఓకేను మళ్లీ తీసుకోవాలనే బిల్లును కాంగ్రెస్ హయాంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం మోదీ ప్రభుత్వ అజెండాలో ఒక భాగమని తాను నమ్ముతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించారు. 


మరోవైపు, పీఓకేను స్వాధీనం చేసుకోవాలనే ఇండియా లక్ష్యం ఎప్పటికీ నెరవేరదని ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ తెలిపారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com