మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి నరికి చంపేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా మొండెం నుంచి వేరుచేసిన తలతో నిందితులంతా కలిసి సెల్ఫీలు దిగారు. జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో ఇటీవల జరిగిందీ ఘటన. ఈ కేసులో ముర్హా ప్రాంతానికి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1న దసాయ్ ముండా కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లిపోగా.. వారి కుమారుడు కను ముండా ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. కుటుంబసభ్యులు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి కుమారుడు కనిపించలేదు. దసాయ్ మేనల్లుడు సాగర్ ముండా, తన స్నేహితులతో కనును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు.