పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్కాలనీలో వివాహిత బాకి మౌనిక (32) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు... మౌనికకు బి.శివ అనే వ్యక్తితో 2006లో వివాహం జరిగింది. అయితే ఆమె గత ఏడాదిగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి ఆ వ్యక్తితో గొడవ పడడంతో మనస్తాపానికి గురైన మౌనిక ఉరేసుకొంది. బయట ఉన్న కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందింది. ఈ మేరకు ఎస్ఐ బి.శివప్రసాద్ కేసు నమోదుచేశారు.మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుప త్రికి తరలించారు. కాగా మౌనిక కుమార్తె ఏడో తరగతి చదువుతోంది.