భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్తకు గిద్దలూరు జిల్లా 7వ అదనపు సెషన్స్ జడ్జీ శిక్ష విధించారు. అందిన సమాచారం మేరకు... గిద్దలూరు పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వెనుక భాగంలో భార్యభర్తలు శ్రీధర్, తిరుపతమ్మలు నివసిస్తున్నారు. వీరు గుంటూరు నుంచి ఇక్కడకు వచ్చారు. భార్య వ్యవహార శైలిపై అనుమానంతో భార్యాభర్తలు శ్రీధర్ తరచూ గొడవపడేవారు. 2021 నవంబరు 16న మద్యం మత్తులో శ్రీధర్ భార్యను అట్లు పోసుకునే పెన్నెంతో కొట్టి చంపాడు. ఎస్‌ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి వెంటనే భర్త శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాడు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు, 7వ అదనపు జడ్జి శరత్‌బాబు ముందు హాజరుపరిచారు. తగిన సాక్షాదారులతో నిందితుడు హత్య చేసినట్లుగా నిరూపణ కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కేసును నాడు చేజించడంలో ప్రత్యేక చొరవ చూపిన ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈకేసులో కోర్టు లైజన్ ఎస్‌ఐ ఎం.వేణుగోపాల్, హెడ్‌కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసులు, జె.రామక్రిష్ణ, కానిస్టేబుల్ శ్రీరాములును అభినందించారు.