ఒంగోలు నగరంలో ని ఒక బంగారం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు రూ. 15 లక్షలు విలువైన సొత్తును దొంగలు అపహరించుకెళ్ళారు. ఈ సంఘటన స్థానిక గాంధీరోడ్డులో వేమూరి హర్ష జువెలర్స్‌లో జరిగింది. ఒంగోలు నగర డిప్యూటి మేయర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి) కి చెందిన బంగారు దుకాణంలో దొంగలు వెనుక వైపు నుంచి వచ్చి కిటికీ గ్రిల్స్ కోసి చొరబడ్డారు. దుకాణ ప్రధాన భాగంలో ఉన్న మరో తలుపునుకూడా రాడ్‌తో పెకలించిన దొంగలు క్యాష్ టేబుల్లో ఉన్న రూ.5లక్షలు నగదు, షోకేసులో ఉన్న బంగారం ఆభరణాలు 300 గ్రాములు అపహరించుకు వెళ్ళారు.మొత్తం విలువ రూ. 15 లక్షలు వరకు ఉంటుందని యజమాని సూర్యనారాయణ తెలిపారు.