‘‘కేంద్రం నుంచి రాష్ట్ర హక్కులు సాధించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర వద్ద వైసీపీ తాకట్టు పెట్టింది. గతంలో జగన్ చెప్పినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలి. వారు చేస్తే మేం కూడా అందుకు సిద్ధమే’’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు నేతృత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రబాబు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ విలేకరులతో మాట్లాడారు.