రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న దాదాసాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని టిడిపి సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. రణస్థలం మండలం హెడ్య్వటర్ గరికిపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారత జాతికి ఎనలేని సేవలు అందించారని, ఆయనను సర్మించుకోవడం జయంతి, వర్ధంతి సమయాలలోనే కాదు ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవలసిన మహానుభావుడు అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa