బడుగు బలహీన వర్గాల జీవితాలను ప్రభావితం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అలజంగి జోగారావు కొనియాడారు. బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించారు. ప్రధాన కూడలిలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891న జన్మించారని, ప్రముఖ న్యాయనిపుణుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారతదేశం మొదటి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పని చేశారని తెలిపారు. దేశం పాలన కోసం రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో ఉన్న ముసాయిదా కమిటీకి కూడా ఛైర్మన్‌గా ఉన్నారు అని, అంటరానివారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చడానికి, వారి స్థితిని పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ డిసెంబర్ 6, 1956న మరణించారు అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ బి గౌరీస్వరి, వైస్ చైర్మన్ కే రుక్మిణీ, ఐ గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, పార్వతీపురం మండల పార్టీ అధ్యక్షులు బి రమేష్, వివిధ వార్డుల కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, స్టేట్ డైరెక్టర్లు, ఏఏంసి డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.