ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు చీరాల పర్యటనను బంపర్ హిట్ చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 07:33 PM

ఈనెల 10వ తేదీన చీరాలలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పాల్గొననున్న దృష్ట్యా ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి అధినాయకుడికి ఘన స్వాగతం పలకాలని బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చీరాల, పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరై వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. చీరాలలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేసి వైసిపి విధ్వంస పాలనకు కనువిప్పు కలిగించాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa