ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు లో మంగళవారం నాడు భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా భాజపా కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై వి గౌతమ్ అశోక్ పాల్గొని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్సీ మోర్చా అల్లరి రామయ్య వారి సేవలను కొని ఆడారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకుడు కాటారపు రాజు, మేడిపల్లి కోటేశ్వరరావు, బొప్పూడి వెంకటనారాయణ, దర్శి రమేష్ బాబు, దావులూరి, రాఘవులు, కత్తుల వెంకట్రావు శేఖర్, అంజయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa