సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ మహిళా కమిషన్ కార్యదర్శి వై.శైలజ తెలిపారు. గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం మహిళలపై హింస.... నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..... బాలికలపై జరిగే సైబర్ నేరాలపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. వాటిపై తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ర్టార్ కరుణ, ఎస్సై వెంకటకృష్ణ, డాక్టర్ శాంతి, బి.మనోరంజని, గౌరీ శంకరి, శ్రీదేవి, విజయ శ్రీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.