జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని ఆయన పలువురి నుండి డబ్బులు వసూలు చేసినట్లు సీబీజీటీ గుర్తించింది. అతడిని 180 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. గతంలో కూడా ఇలాంటి ఆపరోపణలతోనే ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆయనపై గతంలో ఈడీ, సీబీఐ కేసులు సైతం ఉండటం గమనార్హం.