రైతులకు అవసరమయ్యే గోనె సంచులను మిల్లర్లు అందుబాటులో ఉంచాలని జంగారెడ్డిగూడెం జేసీ పి.అరుణ్‌బాబు సూచించారు. మంగళవారం స్ధానిక పాత బస్టాండ్‌లోని ప్రముఖ రైస్ మిల్లులో రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అయన మాట్లాడుతూ.... ధాన్యం తెచ్చిన లారీలను అన్లోడ్ చేసిన వెంటనే పంపించాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఎటువంటి ఇబ్బందులు, అవకతవకలు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.