టీడీపీ ప్రభుత్వంలోనే దళితుల సంక్షేమం సాధ్యమని, అంబేడ్కర్ విదేశీ విద్య పథకం ద్వారా అనేకమంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిందని, నేడు ఎంతోమంది దళిత యువత విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్ధాయిలో స్ధిరపడ్డారంటే అది నారా చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాటిపాముల నాగయ్య, కర్నాటి మణికంఠసాయి, చిరుమామిళ్ల సూర్యం, వేమారెడ్డి శ్రీనివాసరావు, గుండపనేని సురేంద్ర, కొలుసు శ్రీనివాసరావు, మారం అయోధ్యరామయ్య, వీసం ఏడుకొండలు, షేక్ మీరావలి, గర్శేపల్లి చంద్రయ్య, అట్లూరి రామ్‌కిరణ్, తాతినేని సుజన్‌బాబు, తమ్మారెడ్డి సాంబశివరావు, దేవినేని విజయ్, సురేష్ పాల్గొన్నారు.