కృష్ణా జిల్లా, కంకిపాడు పరిధిలోని ఈడుపుగల్లు గ్రామంలో టీడీపీ నాయకులూ , మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ..... దేశంలోనే మత్తుపదార్థాల తయారీలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ ను మత్తాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆరోపించారు. అమరాన్, జాకీ, కియా మోటార్స్ వంటి అనేక సంస్థ లు రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోతున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 1300కు దొరికిన ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు కూడా కష్టంగా లభిస్తోంద న్నారు. ప్రజలకు గోరంత పెడుతూ కొండంత దోచేసు కుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, సర్పంచ్ పందిపాటి ఇందిర, ఉప సర్పంచ్ కిలారు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ షేక్ మాబు సుభాని, పార్టీ నాయకులు షేక్ షకార్, పుట్టగుంట రవి, పందిపాటి సుధాకర్, బాబూజి, గరికిపాటి రవికిషోర్, కాకుళ్ల సుధాకర్, హరీష్, రాయుడు, భవాని, నాగూర్‌బీ, బండారు నిరంజనరావు తదితరులు పాల్గొన్నారు.