తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. తాడిపత్రి మున్సిపల్ పరిధిలో వాహనాలు మరమ్మత్తులకు నోచుకోని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వాహనాల మరమ్మత్తులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. పాడైపోయిన వాహనాలతో జేసీ నిరసనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిరసనకు అనుమతి లేదంటూ జేసీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.