ఝార్ఖండ్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ ప్రియురాలిని బాలుడు దారుణంగా కొట్టి హతమార్చిన ఘటన సిమ్ డేగా జిల్లా బానో పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్కడియుల్ పంచాయతీలో జరిగింది. గ్రామ పరిధిలో ఓ మురికి కాలువ వద్ద పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణ అనంతరం నిందితున్ని అరెస్ట్ చేశారు. ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు ఆందోళన చేస్తూ.. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.