నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 10 లోపు ఇరుపక్షాలు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సీల్డ్ కవర్ లో దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.