అల్బేనియా రాజధాని టిరానా నగరంలో బుధవారం అనూహ్య ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు సాలి బెరిషాపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ముందస్తు ఎన్నికలు జరిపించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెరిషా నిరసనలు చేపట్టారు. ఆందోళనల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎర్ర చొక్కా వేసుకున్న యువకుడు ఒక్కసారిగా భద్రతా వలయం చేధించుకుని ముందుకు వచ్చాడు. బెరిషా ముఖంపై బలంగా గుద్దాడు. బెరిషా కంటి కింద గాయం అయింది. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.