శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి దేవాలయంలో ప్రక్కన వెలసిన శ్రీ దత్తత్రేయ జయంతి వేడుకలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలత స్వామి వారికి వేదపండితుల వేదమంత్రాలతొ దత్తత్రేయునికి పూజలు నిర్వహించారు. భక్తులకోసం అన్నదానం తొ పాటు తీర్థ ప్రసాదం నైవేద్యం అందించారు. ఈ కార్యక్రమములో విశ్వ హిందూ పరిషత్ చారుకీర్తి, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజుప్రసాద్, డి శంకరప్ప, ఆనంద్, నారాయణ, రాజమ్మ రూపరేక, దొంతి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.