టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీ కడప పెద్ద దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని, ఈరోజు ఉర్సు సందర్భంగా దర్గా వద్దకు వచ్చామని, ఉర్సు రోజున ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని పృథ్వీ అన్నారు. పద్దతులు నచ్చక పార్టీని వీడాను. పార్టీలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో పనిచేశాను. నాపై ఆరోపణలు చేసిన వారు ఇక్కడికి వచ్చి అల్లా సాక్షిగా ప్రమాణం చేయమనండి... నీతి నిజాయతీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అని పృథ్వీ అన్నారు.