తలుపుల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి వాటిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ పంచాయతీలో ప్రజలకు సురక్షితంగా నివసించేందుకు వీలుగా ప్రభుత్వ భూములు ఉన్నాయని తక్షణమే రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వ ప్రాంతాల్లో అర్హులందరికీ ఇంటి పట్టాలన్నారు.