బ్రిటీష్ కింగ్ చార్లెస్ లండన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూటన్ అనే పట్టణంలో కొత్తగా నిర్మించిన గురుద్వారాను సందర్శించారు. ఈ మేరకు గురుద్వారాను సందర్శించిన ప్రిన్స్ చార్లెస్ కు వివిధ మతాలకు చెందిన చిన్నారులు సిక్కు జెండాలతో స్వాగతం పలికారు. అక్కడ పిండివంటలు తయారు చేసే పాకశాలను, అక్కడ పనిచేసే వాలంటీర్లను కలిశారు. వారానికి ఏడు రోజులు, ఏడాదిలో 365 రోజులు గురుద్వారా శాఖాహారంతో కూడిని వేడి వేడి భోజనాన్ని అందిస్తుంది.