బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ ఎడమ చేయి బొటన వేలుకు బాల్ తగిలి గాయమైంది. దీంతో రోహిత్ బంగ్లాదేశ్ తో జరిగే మూడో వన్డేలో ఆడట్లేదని, ముంబైలోని స్పెషలిస్టు డాక్టర్ ను రోహిత్ కలవనున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కు సైతం రోహిత్ శర్మ దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గాయం తీవ్రత తక్కువగా ఉండి, అతడు ఫిట్ గా ఉంటే తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లే అవకాశం ఉంది. కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ సైతం గాయాల కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నారు.