కరోనా మహమ్మారి శ్వాసకోశంతో పాటు కొవ్వు కణజాలాన్ని, జ్ఞాపక, గ్రహణ శక్తులనూ నష్టపరుస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. స్వల్పకాలిక గ్రహణశక్తి వారిలో నెలల తరబడి క్షీణిస్తున్నట్లు బ్రిటన్‌లోని యార్క్ హల్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు తేల్చారు. దీన్ని బ్రెయిన్ ఫాగ్‌గా వ్యవహారిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గితే వ్యక్తి దినసరి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.