రైల్వేశాఖలో డీజిల్ వినియోగం భారీగా తగ్గుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతానికి పైగా డీజిల్ వినియోగం తగ్గించినట్లు ఆయన తెలిపారు. డీజిల్ కోసం 2018-19లో రూ.18,587 కోట్లు ఖర్చవ్వగా, 2019-20లో రూ.16,377 కోట్లు, 2020-2021లో రూ.11435 కోట్లు ఖర్చు చేశామని కేంద్రమంత్రి పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధామనం ఇచ్చారు.