ఏపీ ప్రభుత్వం రైతుబజార్ల సిబ్బంది వేతనాలను 23 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు పెంచగా, సూపర్ వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500 కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుండి రూ.24 వేలకు, సూపర్ వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరిగింది. మరోవైపు ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. ఈ పెంపు ఈ నెల నుంచే అమల్లోకి రానుంది.