అంతర్రాష్ట్ర వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపాలంటూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం విచారించింది. ఒడిశా వినతిని సుప్రీం తిరస్కరించింది. అంతర్రాష్ట్ర వివాదాలతో రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సుప్రీం సూచించింది. మనమంతా ఒకే దేశంలో ఉన్నామని గుర్తించాలని హితవు పలికింది. మరోవైపు పోలవరం నిర్మాణంపై అభ్యంతరం లేదని తెలంగాణ చెప్పగా, రెండు నెలల్లో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సీఎంలతో భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.