ఏపీ సీఎం జగన్ గురువారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం పరిశీలకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవలే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa