రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలా మందికి మూత్ర విసర్జన సమస్య వేధిస్తుంటుంది. 70 ఏళ్లు పైబడిన మగవారిలో 70-90 శాతం మంది ఈ సమస్యతో సతమతమయ్యేవారే. 20-40 ఏళ్ల వారిలో దాదాపు 20-44 శాతం మంది దీంతో బాధ పడుతున్నారని అంచనా. అయితే రాత్రి అతి మూత్ర విసర్జన తగ్గడానికి నీరు తగు మోతాదులో తీసుకుంటూ.. రాత్రి 7 తర్వాత ద్రవాలు, కెఫీన్, కూల్ డ్రింక్స్ తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్రపోవడానికి ముందే మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేలా విసర్జన చేస్తే సమస్య నుంచి కొంత బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.