ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. కానీ మేయర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆప్ 134 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 104 స్థానాలను కైవసం చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంది. దీంతో బీజేపీ బలం 116కు చేరనుంది. మరో వైపు మేయర్ ఎన్నికకు పార్టీ విప్ జారీ చేసే అవకాశం లేకపోవటంతో, మేయర్ ఎన్నికల్లో బేరసారాలు జరిగే అవకాశం ఉంది.