వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకుని ప్రజలను చైతన్యం చేసి రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేలా పని చేయాలని తమ అధి నేత చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేసినట్లు గుంతకల్లు నియో జకవర్గం టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్రగౌడు చెప్పారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జితేంద్రగౌడు బుధవారం అమరావతికి వెళ్లి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చంద్ర బాబు నాయుడు తనను ఆప్యా యంగా పలకరించి తన యోగక్షేమా లు అడిగారని జితేంద్రగౌడు చెప్పారు. అనంతరం జరిగిన ముఖా ముఖి సమావేశంలో నియోజక వర్గంలో సమస్యలు, పార్టీ పరిస్థితులు అడిగారని తెలిపారు. పార్టీ నేతలను, కార్యకర్తలను అందరినీ కలుపుకుని వైకాపా అరాచక పాలనను, దౌర్జన్యా లను ప్రజలకు వివరించాని సూచిం చారన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలువుకు ప్రణాళికలు రూపొందిం చుకుని కార్యక్రమాలు చేయాలని చెప్పినట్లు గౌడ్ తెలిపారు.